వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్

వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు థియేటర్లలో ఈ ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ట్రైలర్‌లో లాయర్‌గా పవన్ చెప్పిన డైలాగులు, ఆయన చేసిన ఫైట్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఓ మగాడిని ‘ఆర్ యూ వర్జిన్’ అని పవన్ ప్రశ్నించే సీన్ ఈ ట్రైలర్‌కే హైలెట్. బాలీవుడ్ మూవీ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీకపూర్ కలిసి  నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నివేదా థామస్, అంజలి కీలకపాత్రల్లో నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.  ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.